మాచర్ల మండలం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 2క్రస్ట్ గేట్ల నుంచి డ్యాం అధికారులు నీటి విడుదలను సోమవారం కొనసాగిస్తున్నారు. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 64, 567 క్యూసెక్కుల నీరు ఇన్ ప్లో గా వస్తోంది. దీంతో అధికారులు 2 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి 16, 158 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ నీటిమట్టం 589. 80 అడుగులు, ఇది 311. 4474 టీఎంసీలకు సమానం.