చంద్రబాబునాయుడు చిత్రపటానికి పాలాభిషేకం

2594చూసినవారు
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలోని రెంటచింతల మండలం తుమ్మూరుకోట గ్రామంలో తెదేపా ఇంఛార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి ఒక శుభకార్యంలో పాల్గొన్నారు. అనంతరం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఇటీవల జరిగిన మహానాడులో రాష్ట్రంలో ఉన్న రైతులకు , మహిళలకు , యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తూ "మేనిఫెస్టోను" విడుదల చేసిన సందర్భంగా తుమ్మూరుకోట గ్రామంలో నియోజకవర్గ స్థాయి నేతలు మరియు మహిళలతో కలిసి స్వర్గీయ శ్రీ నందమూరి తారకరామారావు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి "పాలాభిషేకం" చేశారు. అనంతరం బ్రహ్మ రెడ్డి మాట్లాడుతూ గతంలో మహిళలకు ఆర్థిక ఎదుగుదలకు కారణమైన తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా మహిళల పట్ల అండగా ఉంటదని చంద్రబాబు నాయుడు మరోసారి నిరూపించారు అన్నారు మహిళలకు సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు 18 సంవత్సరాలు నుండి 59 సంవత్సరాల్లోపు ఉన్న ప్రతి మహిళకు నెలకి 1500 రూపాయలు తల్లికి వందనం క్రింద ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమందికి సంవత్సరానికి 15000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని ప్రకటించడం దీనికి నిదర్శనం అన్నారు. అలాగే రైతులకు పెట్టుబడి సహాయం సంవత్సరానికి 20000 రూపాయలు మరియు నిరుద్యోగులకు నెలకు 3000 నిరుద్యోగ భృతి మరియు నిరుద్యోగుల కోసం 20 లక్షల ఉద్యోగాలు ప్రకటించడం చాలా ఆనందదాయకమన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్రంలో బీసీలపై దాడులు ఎక్కువయ్యాయని వాటిని అరికట్టేందుకు బీసీలకు ప్రత్యేక చట్టం తెస్తానని చెప్పటం బీసీల పట్ల తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్