ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థి చనిపోయిన ఘటన పల్నాడు జిల్లాలో బుధవారం జరిగింది. మాచర్ల మండలం రాయవరానికి చెందిన ఆర్. అమరలింగేశ్వర రావు (17) పదో తరగతి చదువుతున్నాడు. అతను గత కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ఈక్రమంలో సంక్రాంతి రోజున విషం తాగాడు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మాచర్ల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.