గిరిజన కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందించిన జిల్లా కలెక్టర్

554చూసినవారు
గిరిజన కుటుంబానికి లక్ష రూపాయల పరిహారం అందించిన జిల్లా కలెక్టర్
పల్నాడు జిల్లా మాచర్ల మండలం చింతలతoడ గ్రామంలో ఇటీవల పిడుగుపాటు కారణంగా ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి కుటుంబానికి జిల్లా కలెక్టర్ రూ. లక్ష రూపాయల పరిహారం అందజేశారు. మార్చి 16న చింతలతoడ వాసి రమావత్ సైదానాయక్ పిడుగు పడటంతో మరణించగా శనివారం ఉదయం ఎస్టీ కమిషన్ సభ్యులు వడిత్య శంకర్ నాయక్ తో కలిసి బాధితుడి కుటుంబ సభ్యులకు జిల్లా కలెక్టర్ శివశంకర్ లాటరీ చెక్కు పంపిణీ చేశారు. మృతుడి స్వగ్రామం చింతలతoడలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి వరలక్ష్మి, గురజాల ఆర్డీవో అద్దయ్య, మాచర్ల తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్