హుండీలో సొత్తు దొంగతనం కేసులో ముగ్గురు నిందితులను ఎస్ఐ సమందర్వలి అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం పోలీస్ స్టేషన్లో ఆయన వివరాలు వెల్లడించారు. ఈనెల 14న మండలంలోని కండ్లకుంట గంగాభవాని దేవాలయంలో దొంగతనం జరిగిందన్నారు. హుండీలోని రూ. 1. 05 లక్షలను అదే ప్రాంతానికి చెందిన చంద్రయ్య, సాయి కృష్ణారెడ్డి, మార్కొండారెడ్డిలు దొంగిలించారన్నారు. వారిని గ్రామశివారులో అదుపులోకి తీసుకొని సొమ్మును రికవరీ చేసామన్నారు.