మాచర్ల ఆర్టీసీ డిపో మేనేజర్ బత్తుల వీరస్వామి గురువారం బాధ్యతలు చేపట్టారు. నరసరావుపేట డిపో నుంచి బదిలీపై మాచర్లకు వచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా డీయం వీరాస్వామి మాట్లాడుతూ. డిపో అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. రేపు మాచర్ల నుంచి గుంటూరుకు 7 నూతన బస్సులను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఆతిథిగా హాజరై ప్రారంభించనున్నట్లు చెప్పారు.