పల్నాడు జిల్లాలోని వెల్దుర్తి మండల పరిధిలో గల ఉప్పలపాడు గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును గురువారం నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ప్రసాద్, ఏఈ, గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు