వెల్దుర్తి పోలీస్ స్టేషన్ ముందు మహిళ ఆందోళన

6284చూసినవారు
పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్ స్టేషన్ వద్ద ఆదివారం ఉద్రిక్తత నెలకొంది. చేయని అప్పుకు ప్రామిసరీ నోట్లు రాయమంటూ తమపై ఒత్తిడి చేస్తున్నారంటూ వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన తంగిరాల లక్ష్మమ్మ అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. తమ బంధువు ఒకరు అప్పులపాలై కోర్టు నుండి ఐపీ నోటీసులు ఇవ్వడంతో ఆ డబ్బుకు తమను హామీగా ఉండమని పోలీసుల బెదిరింపులకు గురిచేస్తున్నారని, తన భర్తను రెండు రోజులుగా పోలీస్ స్టేషన్‌కు పిలిపించి 70 లక్షల రూపాయలకు నోటు రాసివ్వాలంటూ తీవ్ర ఒత్తిడికి గురిచేసి చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపణలు చేసింది. తమకు అంత స్తోమత లేదని చెప్పినా.. చేయని అప్పుకు తామెందుకు బాధ్యత వహించాలని సదరు మహిళ రోదిస్తుoది. ఇదే విధంగా వెల్దుర్తి పోలీసులు ఒత్తిడికి గురిచేస్తే పోలీస్ స్టేషన్ ఎదుట కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటాను అంటూ మహిళ హెచ్చరించింది.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్