మంగళగిరిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు

68చూసినవారు
మంగళగిరిలో బాలకృష్ణ జన్మదిన వేడుకలు
హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలను మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎమ్మెస్సెస్ భవన్‌లో సోమవారం ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు దామర్ల రాజు, మండల అధ్యక్షులు తోట పార్థసారథి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి అభిమానులకు తినిపించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య మాట్లాడుతూ హిందూపురం ఎమ్మెల్యేగా బాలయ్య హాట్రిక్‌ విజయం సాధించారని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్