వైసీపీ నాయకులపై మంత్రి లోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గురువారం తుళ్లూరు మండలం వెలగపూడి సచివాలయంలో లోకేష్ మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో చంద్రబాబు ప్రతిరోజూ అసెంబ్లీకి వచ్చారని, శాసనసభ సాక్షిగా మా తల్లిని అవమనించిన తర్వాతే బాయికాట్ చేశామని లోకేశ్ పేర్కొన్నారు. వైసీపీ దుష్ప్రచారంపై లోకేశ్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు పారిపోయారని వైసీపీ సభ్యులు మాట్లాడుతున్నారు.