సమగ్ర శిక్షా ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె ఆదివారం కొనసాగింది. నరసరావుపేట స్థానిక ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న సమ్మెకు ఎస్టియు పల్నాడు జిల్లా కార్యదర్శి ఏ రామకోటయ్య , రొంపిచర్ల మండల ఉపాధ్యాయ సంఘాల బాధ్యులు బిక్కి ప్రజా మూర్తి సంఘీభావం తెలిపారు.