వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లుగా విస్మరించడం వలన నరసరావుపేటలోని స్మశానవాటికలు ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు విమర్శించారు. బుధవారం పట్టణంలోని స్మశానవాటికలను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. పట్టణ చుట్టుపక్కల ఉన్న ముస్లిం, క్రైస్తవ తదితర స్మశానవాటికలను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.