ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ శ్రీశ్రీకళావేదిక ఆధ్వర్యంలో ఏలూరులో సోమవారం జరిగిన తెలుగు భాషా దినోత్సవ సంబరాలలో భాగంగా పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన గుండాల రాకేష్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాహిత్య అకాడమీ చైర్మన్ పిళ్ళంగొల్ల శ్రీలక్ష్మి సాహితీ సేవా పురస్కారం అందజేశారు. ఈ సంబరాలలో ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక రాష్ట్రాల నుండి కవులు పాల్గొన్నారు.