నరసరావుపేట నియోజకవర్గాన్ని కేవలం మూడునెలల కాలంలో పేకాట, కోడిపందేలు, మద్యం, రేషన్ గ్రానైట్ ఇసుక, బియ్యం, లారీలు, దందాల నిలయంగా కూటమి ప్రభుత్వ నాయకుడు, ఎమ్మెల్యే మార్చాడని బుధవారం మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం అయన మాట్లాడుతూ అచ్చంపాలెం గ్రామంలో ఎమ్మెల్యే కుమారుడు బావమరిది విజయ్ అనే వ్యక్తి స్వయంగా కొబ్బరికాయ కొట్టి లాంఛనం గా కోడి పందేలు ప్రారంభించటం నరసరావుపేటలో ఒక చరిత్ర అన్నారు.