ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించిన ప్రకారం 50 సంవత్సరాలు పైబడిన వారు బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటే ఆరోగ్యకరంగా ఉంటుందని ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కరోనా సోకిన, షుగర్ వచ్చిన వారు తప్పనిసరిగా బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవాలని అన్నారు. ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఎమ్మెల్యే స్వయంగా వ్యాక్సిన్ను బుధవారం నరసరావుపేటలోని ప్రభుత్వ ఆసుపత్రిలో తీసుకున్నారు.