పర్చూరు ప్రభుత్వ వైద్యశాలను ఆసుపత్రి డైరెక్టర్ మామిడిపాక హరి ప్రసాదరావు మంగళవారం సందర్శించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు ఆదేశాలతో వైద్య చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, ఆసుపత్రి సిబ్బందికి శానిటైజర్, మాస్కులు అందజేశారు. ప్రస్తుతం ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్న హెచ్ఎంపీవీ వైరస్ పట్ల ప్రజలు భయపడాల్సిన పనిలేదని ఆయన అన్నారు. సామాజిక దూరం, మాస్క్ వంటి జాగ్రత్తలు పాటించాలన్నారు.