యద్దనపూడి మండలం అనంతవరంలో నాలుగు రోజులుగా జరుగుతున్న ఎన్టీఆర్ కళాపరిషత్ నాటికల పోటీలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా జనరల్ బోగీలు నాటిక ఎంపికైనట్లు న్యాయ నిర్ణీతలు తెలిపారు. విశిష్ట అతిథిగా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ మనిషి జీవితాలను మార్చగల సత్తా కళా రంగానికి ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కళారంగాన్ని ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు.