పెదకూరపాడు మండల పరిధిలోని 20 గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపడుతున్న కార్మికులకు స్వచ్ఛత హీ సేవా కార్యక్రమంలో భాగంగా ఈనెల 23న పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు సిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ విద్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని పారిశుధ్య కార్మికులు ఉపయోగించుకోవాలని ఆమె సూచించారు.