పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్ లో మంగళవారం బాలికలకు హిమోగ్లోబిన్ పరీక్షలను నిర్వహించి, వారి హైట్, వెయిట్ లను నమోదు చేశారు. హిమోగ్లోబిన్ శాతం పెరగడానికి అవసరమైన ఆహారాన్ని, తీసుకోవాల్సిన ఇతర చర్యలను బాలికలకు మెడికల్ బృందం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎ. ఎన్. ఎమ్ గ్రేసమ్మ, ఇతర మెడికల్ సిబ్బంది పాల్గొన్నారు. హెచ్ఎం ఎ. శ్రీనివాస రెడ్డి, ఉపాధ్యాయులు పర్యవేక్షించారు.