పెదకూరపాడు మండలం 75 త్యాళ్ళూరు హైస్కూల్లో విప్లవ వీరుడు రాజ్ గురు జయంతిని శనివారం జరిపి నివాళులు అర్పించారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం ఏ విధంగానైనా విముక్తి పొందాలని కోరుకున్న రాజ్ గురు హిందూస్తాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ సభ్యుడిగా, లజపతిరాయ్ మరణానికి కారణమైన బ్రిటిష్ అధికారి సాండర్స్ పై పగతీర్చుకున్న గొప్ప దేశభక్తుడు అని హెచ్. ఎం ఎ. శ్రీనివాస రెడ్డి అన్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.