పెదకూరపాడు నియోజకవర్గంలో వరదల ప్రభావం పై మరియు వినాయక చవితి ఉత్సవాల ఏర్పాట్ల పై అమరావతి మండల అధికారులతో సమీక్ష సమావేశం ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ బుధవారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ రానున్న భారీ వర్షాల పై అప్రమత్తంగా ఉండాలన్నారు. విపత్కర పరిస్థితుల్లో అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని గత మూడు రోజులుగా కురిసిన భారీ వర్షాలతో పద్దెనిమిది గ్రామాలు వరద బారిన పడ్డాయని తెలిపారు.