అమరావతి మండలంలోని వైకుంఠపురం గ్రామాన్ని వరద ఆదివారం అర్థ రాత్రి చుట్టుముట్టింది. సమాచారం అందడంతో వాహనాలు వెళ్లే పరిస్థితి లేనప్పటికీ బైక్ పై గ్రామానికి చేరుకొని వరద ముంపు ప్రాంతాలని పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పరిశీలించారు. వరద ఉద్ధృతి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మనోధైర్యాన్ని ఇచ్చి ముంపు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద సహాయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆదేశించారు.