అమరావతి మండలంలోని వైకుంటపురం గ్రామంలో కృష్ణా నది పరివాహ ప్రాంతంలో కరకట్టకు సోమవారం ఇసుక బస్తాలను ఆ గ్రామస్తులు వేస్తున్నారు. కృష్ణానది ప్రవాహం ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో గ్రామంలోనికి వరద రాకుండా అడ్డుకునేందుకు ప్రజలు, అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కృష్ణా నదికి వరద ప్రవాహం మరింతగా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.