నాగార్జున సాగర్ కు వరద తగ్గుముఖం పట్టింది. దీంతో బుధవారం సాగర్ డ్యామ్ క్రస్ట్ గేట్లు అధికారులు మూసివేశారు. కృష్ణానది పొంగి ప్రవహించడంతో పెదకూరపాడు నియోజకవర్గంలోని అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ మండలాల్లో నదీ పరివాహక గ్రామాలు నీట మునిగాయి. గేట్లు మూసి వేయడంతో ఆయా మండలాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.