తుఫాన్ ఎఫెక్ట్.... బెల్లంకొండలో భారీ వర్షం

58చూసినవారు
బెల్లంకొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో అల్పపీడనం ప్రభావంతో బుధవారం భారీ వర్షం కురిసింది. వర్షం కారణంగా ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. దీంతో వ్యవసాయ కూలీలు ఇంటిదారి పట్టారు. వాహనదారులు ఇబ్బందులకు గురయ్యారు. వరి పంట చేతికి వచ్చే సమయంలో వర్షం పడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్