తెలుగుదేశం పార్టీ గ్రామాభివృద్ధికి ,పేదల ఆర్థిక స్వాలంబనకు కృషి చేస్తుందని పెదకూరపాడు మాజీ ఎమ్మెల్యే మరియు పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు కొమ్మాలపాటి శ్రీధర్ అన్నారు. బుధవారం మండలంలోని లింగంగుంట్ల, పెద్దకూరపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు.ఆయా గ్రామాలలో ప్రజల సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. శ్రీధర్ వెంట మండల టిడిపి అధ్యక్షులు రమేష్, టిడిపి నాయకులు బాబురావు,ముంతాజ్ పాల్గొన్నారు.