గుంటూరు జిల్లా పొన్నూరు ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య ఆదివారం నాటి పర్యటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఆదివారం సాయంత్రం 4 గంటలకు ఈనెల డిసెంబర్ 7వ తేదీ జరగనున్న జయహో బీసీ మహాసభ సందర్భంగా చేబ్రోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు బీసీ సదస్సు పోస్టర్ విడుదల కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ తో కలసి పాల్గొంటారు.
కావున ఈ కార్యక్రమంలో పొన్నూరు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ బీసీ సర్పంచులు, ఎంపీటీసీలు, బీసీ నాయకులు మరియు బిసి సోదర సోదరీమణులు అందరూ పాల్గొనవలసినదిగా పొన్నూరు వైఎస్ఆర్సిపి పార్టీ కార్యాలయం నుండి శనివారం సాయంత్రం ప్రకటన ద్వారా తెలిపారు.