పొన్నూరు ఎంఈఓ రుద్రపాటి శోభా చంద్ సస్పెండ్

58చూసినవారు
పొన్నూరు ఎంఈఓ రుద్రపాటి శోభా చంద్ సస్పెండ్
గుంటూరు జిల్లా పొన్నూరు మండలం విద్యాశాఖ అధికారి రుద్రపాటి శోభా చంద్ సస్పెండ్ చేస్తూ జిల్లా ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల కౌంటింగ్ నిర్వహణపై వాట్సాప్ గ్రూపులో తప్పుడు ప్రచారం చేయడంపై జిల్లా అధికారుల విచారణ చేపట్టారు. వాస్తవమని తేలడంతో ప్రాంతీయ సంయుక్త సంచాలకులు లింగేశ్వర రెడ్డి సస్పెండ్ చేశారు. జగన్ ఫాలోవర్స్ గ్రూపు లో పోస్టులు పెట్టడంపై పలు విమర్శలు వెల్లువెత్తాయి.