ఆరు రోజులైనా ఎంపీడీవో వెంకటరమణ ఆచూకీ దొరకడం లేదు. ఎంపీడీవో వెంకటరమణ మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఏలూరు కాలువలో దూకాడని పోలీసులు గాలించారు. అయితే కాలువలో దూకితే మృతదేహం దొరకకుండా ఉండదని పోలీసులు చెబుతున్నారు. అసలు కాలువలో దూకాడా? లేదా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఆరు రోజులుగా ఎంపీడీవో మిస్సింగ్ కేసులో పురోగతి లేకపోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు.