పొన్నూరు: విలీన గ్రామాల ఏర్పాటు పై గ్రామ సభలు

78చూసినవారు
పొన్నూరు: విలీన గ్రామాల ఏర్పాటు పై గ్రామ సభలు
గుంటూరు జిల్లా పొన్నూరు మున్సిపాలిటీలో చింతలపూడి, వడ్డిముక్కల గ్రామాలు విలీనం చేసేందుకు గురువారం గ్రామసభ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఎంపీడీవో చంద్రశేఖర రావు, ప్రత్యేక అధికారి మల్లికార్జునరావు, గ్రామాధికారులు పాల్గొని రెండు గ్రామాలలో ప్రజాభిప్రాయాన్ని సేకరించారు. మున్సిపాలిటీ లో విలీనమైతే మౌలిక వసతులు, అభివృద్ధి వివిధ అంశాలను వివరించారు. ప్రజలు విలీనానికి వ్యతిరేకంగా అభిప్రాయాలు తెలిపారు.

సంబంధిత పోస్ట్