గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం అభినేనిగుంటపాలెం మల్లాయపాలెం మేజర్ కాలువ పూడిక తీత పనులను గురువారం ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు ప్రారంభించారు. రూ. 40 లక్షల వ్యయంతో కాలువ పూడికతీత పనులను చేపట్టామని రైతులకు ఎలాంటి కష్టం లేకుండా చివరి వరకు నీళ్లందే విధంగా కాలువ పూడికతీత జరుగుతుందన్నారు. కార్యక్రమంలోనీటి సంఘాల అధ్యక్షులు, కూటమి శ్రేణులు, అధికారులు పాల్గొన్నారు.