ప్రత్తిపాడు మండలం మల్లయ్య పాలెం సెంటర్ లో శుక్రవారం వైఎస్ జగన్ పిలుపుమేరకు కూటమి ప్రభుత్వం విద్యుత్ చార్జీల పెంపు నిరసనగా ఆ పార్టీ శ్రేణులు పోరుబాట ఆందోళన చేపట్టారు. వైఎస్ఆర్ విగ్రహం నుండి ర్యాలీగా నిమ్మగడ్డ వారి పాలెం రోడ్డులోని కరెంట్ ఆఫీస్ కు చేరుకున్నారు. పెంచిన సర్ చార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం విద్యుత్ శాఖ అధికారికి వినతిపత్రం అందించారు.