జాతీయ రహదారిని మంచు దుప్పటి కమ్మేసింది. చెరుకుపల్లిలో గురువారం ఉదయం జాతీయ రహదారిపై మంచు అధికంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. మంచు కారణంగా రహదారి కనిపించకపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంక్రాంతి పండుగ సెలవులు అయిపోవడంతో అందరూ స్వస్థలాలకు వెళ్లేందుకు వేకువ జామునే ప్రయాణాలు కొనసాగించగా మంచు కారణంగా ప్రయాణాలకు ఆటంకం కలుగుతుంది.