ఈ నెల 23వ తేదీ సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం జరుగుతుందని చెరుకుపల్లి మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మల్లాది రామకృష్ణ ఆదివారం తెలిపారు. కార్యక్రమానికి రాష్ట్ర రెవెన్యూ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖమంత్రి అనగాని సత్య ప్రసాద్ హాజరవుతున్న నేపథ్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొనాలని రామకృష్ణ కోరారు.