గ్రామాలలో ప్రజల సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించటమే పల్లెనిద్ర కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశమని రేపల్లె డిఎస్పి ఆవల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం రాత్రి చెరుకుపల్లి కాపులు బజార్ లో పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలకు చట్టాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎస్సై అనిల్ కుమార్, గ్రామ పెద్దలు ఎంఆర్కె మూర్తి, దివి రాంబాబు పాల్గొన్నారు.