పొన్నూరు: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రౌండ్ టేబుల్ సమావేశం

68చూసినవారు
ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఆదివారం పొన్నూరు రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక జేఏసీ నాయకుడు, న్యాయవాది పొందుగల చైతన్య ఆధ్వర్యంలో జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో సుప్రీంకోర్టు వర్గీకరణకు వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును మాల న్యాయవాదులు, దళిత సంఘాలు, జేఏసీ నాయకులు ఖండించారు. వర్గీకరణ విషయంలో ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దన్నారు.

సంబంధిత పోస్ట్