హైర్ బస్ డ్రైవర్ పై జరిగిన దాడికి నిరసన

50చూసినవారు
రేపల్లె డిపో హైర్ బస్ డ్రైవర్ పై తెనాలి వద్ద జరిగిన దాడిని నిరసిస్తూ సోమవారం డ్రైవర్లు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ రేపల్లె డిపో పరిధిలో హైర్ బస్ డ్రైవర్లకు రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. మణిలాల్ డిమాండ్ చేశారు. గత శనివారం రేపల్లె నుండి విజయవాడ వెళుతున్న రేపల్లె డిపో ప్రైవేట్ హైర్ బస్ డ్రైవర్ పై చింతలపూడి వద్ద మద్యం మత్తులో దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేయాలన్నారు.

సంబంధిత పోస్ట్