విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో పూరిల్లు దగ్ధం

56చూసినవారు
రేపల్లె పట్టణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. రేపల్లె పట్టణంలోని 24వ వార్డులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా షేక్ కరీముల్లాకు చెందిన పూరిల్లు పూర్తిగా దగ్ధమైంది. స్థానికులు సకాలంలో స్పందించి మంటలను అదుపు చేయటంతో పెను ప్రమాదం తప్పింది. ఇంట్లోనీ వస్తువులన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంలో ఎంత నష్టం జరిగిందని వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్