రీసర్వే పూర్తైన గ్రామాలలో ఈనెల 22వ తేదీ నుండి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు రేపల్లె తహసిల్దార్ శ్రీనివాసరావు తెలిపారు. సోమవారం తహసిల్దార్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రేపల్లె మండలంలోని మూడు గ్రామాలలో రీ సర్వే పూర్తయిందన్నారు. రీ సర్వేలో ఏవైనా తప్పులుంటే గ్రామసభలలో సరి చేసుకోవచ్చన్నారు. కారుమూరు, పరిసపాడు గ్రామాలలో ఈనెల 22వ తేదీ, అరవపల్లి లో ఈనెల 26వ తేదీన గ్రామసభ జరుగుతుందన్నారు.