వర్షం మరియు వరదల కారణం వలన రేపు సోమవారం బాపట్ల జిల్లాలోని కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల్లోని అన్ని యాజమాన్యాల (ప్రభుత్వ, ప్రైవేట్, ) పాఠశాలలకు కలెక్టర్ వెంకట మురళి ఆదేశాల మేరకు సెలవు ప్రకటించటమైనదని బాపట్ల జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొంది. వర్షాల, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ వెంకట మురళి సూచించినట్లు వారు తెలిపారు.