రొంపిచర్ల: విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. వివరాల్లోకి వెళ్తే.. రొంపిచర్ల నుంచి శుక్రవారం నరసరావుపేటకు వస్తున్న ఆర్టీసీ బస్సు అన్నవరం గ్రామం సమీపంలో ఆవును తప్పించబోయి విద్యుత్ స్తంభానికి ఢీకొట్టింది. బస్సులో ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు