సత్తెనపల్లి పట్టణంలోని తాలూకా సెంటర్లో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం అన్న క్యాంటీను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ. పేదవాడి ఆకలి తీర్చేందుకు ఈ అన్న క్యాంటీన్లు ఎంతగానో ఉపయోగపడతాయని, అన్న క్యాంటీన్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ షమ్మీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.