యువతకు పొట్టి శ్రీరాములు ఆదర్శమని జిల్లా ఎస్పీ కే. శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన సమరయోధుడు, తెలుగువారికి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుచేసిన నాయకుడు పొట్టి శ్రీరాములు అన్నారు. ఎస్పీ శ్రీనివాసరావుతో పాటు డీఎస్పీలు ఉన్నారు.