పల్నాడు జిల్లాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మందికి పాడిపరిశ్రమ జీవనోపాధి కల్పిస్తోంది. కీలకమైన పాడి పోషణను ప్రోత్సహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. పాడికి మేలు చేసేలా పశు వైద్య శిబిరాల్ని సోమవారం నుంచి ఈ నెల 31 వరకు నిర్వహించనుంది. ఆ వివరాలను పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్ కె. కాంతారావు సోమవారం వెల్లడించారు.