తుళ్ళూరు మండలంలోని బోరుపాలెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా తరలిస్తున్న ట్రాక్టర్ ను పోలీసులు మంగళవారం సీజ్ చేశారు. వారి వివరాల ప్రకారం బోరుపాలెం ఇసుక రీచ్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో దాడి చేసి దొండపాడు గ్రామానికి చెందిన కొలసాని సీతారామయ్య, ఇసుక డంప్ చేసి అమ్మిన వట్టికూటి బాబీపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.