గుంటూరు జిల్లా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ(హాన్స్), బీటెక్(ఫుడ్ టెక్నాలజీ) కోర్సుల్లో 2024-25 ఏడాదిలో మిగిలిన సీట్లకు ప్రవేశాలకు రెండో దశ ఆన్లైన్ వెబ్ ఆప్షన్లు ఈనెల 15, 16వ తేదీల్లో నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి. రామచంద్రరావు శుక్రవారం తెలిపారు. విద్యార్థులు పూర్తి వివరాలకు angrau. ac. in వెబ్ సైట్లో చూడాలని సూచించారు.