తెనాలిలోని రక్షణ ఎయిరో స్పేస్ అంకుర సంస్థ ఎన్-స్పేస్ టెక్ రూపొందించిన తొలి యుహెచ్ఎఫ్ కమ్యూనికేషన్ పేలోడ్ విజయవంతమవడం పట్ల సీఈవో దివ్య కొత్తమాసు గురువారం హర్షం వ్యక్తం చేశారు. గత నెల 30న ఇస్రో ప్రయోగించిన పిఎస్ఎల్వి- సి60తో నింగిలోకి పంపిన పేలోడ్ నుంచి డేటా బదిలి పర్ఫెక్ట్ గా జరుగుతోందన్నారు. ఏడాదిగా తమ ఇంజినీర్లు రపొందించిన తొలిదశ పేలోడ్ సక్సెస్ ఫుల్ గా ప్రారంభించడం తమ కష్టానికి ప్రతిఫలమన్నారు.