టీడీపీ పోలీట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్థన్ ను అమరావతి దళిత జేఏసీ నేత పులి చిన్నా బుధవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన అమరావతి ప్రాంతంలో జరుగుతున్న పలు విషయాలను జనార్థన్ దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం కొన్ని విషయాలపై కీలకంగా చర్చించారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.