కుటుంబ కలహాల నేపధ్యంలో అత్త చెవిని కోడలు కొరికేసిన ఘటన గుంటూరు జిల్లా తుళ్లూరులో మంగళవారం జరిగింది. అత్త నాగమణి, కోడలు పావని మధ్య ఘర్షణలో అత్త చెవిని బలంగా కొరకడంతో చెవిలోని ఒక ముక్క ఊడిపడింది. ఆ ముక్కను తీసుకుని అత్త నాగమణి గుంటూరు జీజీహెచ్ ఆస్పత్రికి వెళ్లగా తెగి ఎక్కువ సమయం కావడంతో అతికించడం సాధ్యం కాదని డాక్టర్లు స్పష్టం చేశారు.