నూతన విద్యుత్ లైన్ ఏర్పాటు కారణంగా శనివారం తెనాలి పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏఈ లక్ష్మీనారాయణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు తెనాలి పట్టణంలోని సుల్తానాబాద్, సుందరయ్య నగర్, ఆలపాటినగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.